ఏడాదికి పైగా షూటింగ్ జరుపుకుంటున్న 'సర్కారు వారి పాట' ప్రస్తుతం చివరి దశలో ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా తుది షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో మహేష్ బాబుకు సంబంధించి సాంగ్, ప్యాచ్ వర్క్ తో కంప్లీట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో 'సర్కారు వారి పాట' బిజినెస్ డీల్‌కి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది.
దేశంలోనే కాదు విదేశాల్లో కూడా మహేష్ బాబు సినిమాలకు మంచి బిజినెస్ ఉంటుందనే సంగతి మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ‘సర్కారు వారి పాట’ చిత్ర ఓవర్సీస్ హక్కును ఓ ప్రముఖ పంపిణీ సంస్థ సుమారు 15 కోట్ల రుపాయలకు తీసుకుందని ఇప్పటికే ఈ డీల్ పూర్తయిందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల మీద నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట, మహేష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పరశురామ్ దర్శకత్వంలో బ్యాంకింగ్ రంగంలో జరిగుతున్న అతిపెద్ద కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ బాణీలు కడుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.