రాజ‌మౌళి, మహేష్ బాబు సినిమాలో తమిళ స్టార్ హీరో విల‌న్‌... ఎవ‌రో తెలిస్తే మీరు నమ్మరు!

ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్, కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగ‌తి అందరికి తెలిసిందే. 

Rajamouli

ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మరోపక్కన విజయేంద్ర ప్ర‌సాద్ క‌థ‌ను సిద్ధం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించినఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. రాజ‌మౌళి సినిమాలో విల‌న్ పాత్ర హీరోకి ధీటుగా ఉంటుంది. ఢీ అంటే ఢీ మహేష్ బాబు మాస్ రేంజ్ తగ్గట్టు రాజమౌళి విల‌న్ పాత్ర‌ల‌ను క్రియేట్చేస్తార‌న‌డంలో సందేహ‌మే లేదు. ప్రస్తుతం అలాంటి కోత్త ప‌వ‌ర్‌ఫుల్ విల‌నీ పాత్ర‌ను మ‌హేశ్ బాబు సినిమా కోసంఆయ‌న డిజైన్ చేశార‌ట‌. ఈ పాత్ర‌లో మన కోలీవుడ్ మల్టీ టేలెంట్ స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్ నటించేఅవ‌కాశం ఉంద‌ని, ఆయ‌న‌తో సంప్ర‌దింపులు జ‌ర‌ప‌డానికి రెడీ అవుతున్నారంటూ టాలీవుడ్ లో వార్తలు వైరల్ అవుతుంది. అయితే ఈ న్యూస్ అధికార పూర్వంగా రాలేదన్న విషయం అయితే తెలుస్తుంది.


ఒక‌వేళ ఈ న్యూస్ నిజ‌మే అయితే సినిమాలో స్టార్ హీరోగా ఇమేజ్ ఉన్న విక్ర‌మ్ విల‌న్‌గా న‌టిస్తారా? అనేది ఆలోచించాల్సిన విష‌యం ఎంతైన ఉంది. అయితే గ‌తంలో రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈగ సినిమాకోసం హీరో సూర్యను విల‌న్‌గా న‌టించాల‌ని రాజమౌళి సంప్రదిస్తే సూర్య నిరాకరంచారు. త‌ర్వాత ఆ పాత్ర‌లోక‌న్న‌డ స్టార్ కిచ్చా సుదీప్ న‌టించారు. మ‌రి ఈసారి రాజ‌మౌళి ఇచ్చే అవ‌కాశానికి హీరో విక్ర‌మ్ ఓకే అంటారోలేదో వేచి చూడాలి. సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం ప్రకారం అయితే ఆఫ్రికాలో కౌ బాయ్ బ్యాక్‌డ్రాప్‌లో మ‌హేశ్ బాబు సినిమాను తెర‌కెక్కించ‌డానికి రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నారని న్యూస్ వినిపిస్తుంది‌. ఈ సినిమానుదుర్గాఆర్ట్స్ అధినేతి కె.ఎల్‌.నారాయ‌ణ నిర్మించనున్నారు. 


ప్ర‌స్తుతం మ‌హేశ్ బాబు హీరోగా ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స‌ర్కారువారి పాట చిత్రం షూటింగ్జ‌రుపుకుంటోంది. ఈ సినిమా వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 1న విడుద‌ల‌వుతుంది. స‌ర్కారువారి పాట త‌ర్వాత మ‌హేశ్ బాబు హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఆ సినిమా పూర్త‌య్యేలోపు క‌థ‌, ఇత‌ర ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను రాజ‌మౌళి అండ్ టీమ్ పూర్తి చేసుకుంటారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో వస్తున్నా RRR సినిమాను విడుద‌ల చేసే ప‌నిలో రాజమౌళి బిజీగా ఉన్నారు. వ‌చ్చే ఏడాదిసంక్రాంతి సంద‌ర్భంగా ఈ సినిమాను జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేస్తున్నారు. 



కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది