'రాక్షసుడు' ట్విట్టర్ రివ్యూ

తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమా ‘రాచ్చసన్’ ఈ సినిమాను ‘రాక్షసుడు’ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా  అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించారు. రమేశ్ వర్మ దర్శకత్వం వహించారు. ఎ స్టూడియోస్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై కోనేరు స‌త్యనారాయ‌ణ నిర్మించారు. అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను విడుదల చేసింది. ట్రైలర్‌తో సినిమాపై ఆసక్తిని రేకెత్తించిన ‘రాక్షసుడు’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఒక్క రోజు ముందుగానే యూఎస్‌లో ప్రీమియర్ షో ప్రదర్శించారు. అక్కడ సినిమాను చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా సినిమా బాగుందని తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గత సినిమాలతో పోలిస్తే ఇందులో ఆయన నటన మరి చాలా బాగుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం స్క్రీన్‌ప్లే అని చెబుతున్నారు. స్క్రీన్‌ప్లే‌తో ప్రేక్షకుడికి మంచి అనుభూతిని ఇచ్చారు. తరవాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని క్రియేట్ చేశారని అంటున్నారు. అయితే సెకండాఫ్‌ ఒరిజినల్‌ ఎలా ఉందో అలానే దించేశారని చెబుతున్నారు.
సినిమాకు  బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరో బలం. ఇంటర్వెల్ బ్లాక్ అయితే అదిరిపోయిందని కొందరు ట్వీట్లు చేస్తున్నారు. మొత్తానికి బెల్లంకొండ శ్రీనివాస్‌కు చాలా రోజుల తరవాత ఒక హిట్ వచ్చినట్టే. అయితే, ‘రాక్షసుడు’తో శ్రీనివాస్‌కు బ్రేక్ వస్తుందని అంటున్నారు.
మరి ఈ సినిమా ఏ మేరకు వసూళ్లు రాబడుతుందో చూడాలి!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది