కరోనాను ఎదిరించి సంపూర్ణ ఆరోగ్యంతో ఇల్లు తిరిగిన డాక్టర్ రాజశేఖర్


హీరో డాక్టర్ రాజశేఖర్ గత కొద్ది రోజుల క్రితం కరోనావైరస్ పాజిటివ్ వచ్చి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. వైద్య సిబ్బందితో కలిసి ఫోటో దిగి అందరికి ధన్యావాదాలు తెలిపారు.

Pocket Cinema News

తనెల రోజులుగా బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్‌లో రాజశేఖర్ చికిత్స పొందుతున్నారు. ఆయన భార్య జీవిత ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇచ్చారు. తాజాగా ఆయన కరోనా నుంచి బయటపడటంతో వైద్యులు ఆయన్ని ఇంటికి డిశ్చార్జ్ చేశారు.

కరోనా చాల క్లిష్ట పరిస్థితుల్లో డాక్టర్ రాజశేఖర్ ప్రాణాపాయం నుంచి కాపాడిన సీఎన్‌సీ వైద్య బృందానికి జీవిత రాజశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. నెలరోజులుగా ఆస్పత్రి సిబ్బంది తమను కుటుంబసభ్యుల్లా చూసుకున్నారని. రాజశేఖర్ అభిమానులు, సన్నిహితుల ప్రార్థనలు ఫలించి రాజశేఖర్ కోలుకున్నారని జీవిత సంతోషం వ్యక్తం చేశారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది