‘సాహో’ ప్రీ రిలీజ్ వేడుక సందడి మొదలైపోయింది

ప్రభాస్ అభిమానులకు ‘సాహో’ సందడి మొదలైపోయింది. చాలా కాలం తరవాత ప్రభాస్‌ను నేరుగా చూసే అవకాశం వేలాది మంది అభిమానులకు కలగనుంది. ‘బాహుబలి’ సినిమా తరవాత ‘సాహో’ షూటింగ్‌తో బిజీ అయిపోయిన ప్రభాస్.. ఇప్పుడు ఆ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సినిమా విడుదలకు ముందు ఎంతో ఘనంగా నిర్వహించే ప్రధానమైన ప్రీ రిలీజ్ వేడుకతో ప్రభాస్ అభిమానుల ముందుకు వస్తున్నారు.
ఈనెల 18న సాయంత్రం 5 గంటల నుంచి హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ‘సాహో’ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్టర్‌ను కూడా నాలుగు భాషల్లో షేర్ చేసింది. ఆగస్టు 18న సాయంత్రం 5 గంటల నుంచి సాహో ప్రీ రిలీజ్ వేడుకతో ‘సాహో’ను సెలబ్రేట్ చేసుకుందాం’’ అని యూవీ క్రియేషన్స్ ట్వీట్‌లో పేర్కొంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది