ఐరోపాలో అత్యంత పెద్ద ‘సెక్స్ ఫెస్టివల్’

ఐరోపాలోనే అత్యంత పెద్ద ‘సెక్స్ ఫెస్టివల్’గా పేరొందిన ఈ వేడుకను ‘స్వింగ్‌ఫీల్డ్స్’ అనే సంస్థ నిర్వహిస్తోంది. ఈ నెల 4న ప్రారంభమైన ఈ వేడుక ఆదివారంతో ముగిసింది. 700 మంది పైగా సందర్శకులు తమ పార్టనర్లతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నట్లు తెలిసింది. ఓ గ్రామంలోని పొలాల మధ్యలో ఈ వేడుకను నిర్వచించారు. 

వేడుక ప్రత్యేకతలు. 
ఈ వేడుకలో తన పార్టనర్లతో బహిరంగంగానే సెక్స్ చేయొచ్చు. డబుల్ డెక్కర్ పార్టీ బస్సు, బెల్ టెంటులు, షవర్‌లు, మెత్తని పరుపులు, తెరలు ఏర్పాటుచేసిన పందిరి మంచాలు ఇంకా ఎన్నో సదుపాయాలను కల్పించారు. వీటితోపాటు డీజే, కామెడీ షో, లైవ్ మ్యూజిక్ వంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు.

గతంలో ఈ ఫెస్టివల్ వేదికను ముందుగానే ప్రకటించడంతో పెద్ద రచ్చే జరిగింది. వందలాది మంది వేదిక స్థలానికి చేరుకుని టికెట్ల కోసం ఎగబడ్డారు. దీంతో అక్కడ శాంతి భద్రతల సమస్య ఏర్పడింది. అలాగే, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. సెక్స్ ఫెస్టివల్ తర్వాత ఆ ప్రాంతం వాడేసిన కండోమ్‌లు, లోదుస్తులతో అపరిశుభ్రంగా మారింది. దీంతో సుమారు మూడేళ్ల వరకు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ వేడుక జరిగేందుకు అంగీకరించలేదు.
ఈ సారి అప్రమత్తంగా వ్యవహరించారు. ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించి, వేడుక వివరాలను రెండు రోజులు ముందు ప్రకటించారు. డ్రగ్స్, స్మోకింగ్ నిషేదించారు. మొబైల్ ఫోన్లను కేవలం టెంట్లలో మాత్రమే వాడాలని, వేడుక ప్రాంగణంలో వాడినట్లయితే వాటిని స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారాని ‘మిర్రర్’ వెబ్‌సైట్ వెల్లడించింది.

2 కామెంట్‌లు

కొత్తది పాతది