విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. విడుదలకు ముందే ఈ సినిమాను చూసిన బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్.. ‘డియర్ కామ్రేడ్’ చాలా బాగుందంటూ, ఈ చిత్రాన్ని హిందీలో తానే రీమేక్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
అయితే, ‘డియర్ కామ్రేడ్’ హిందీ రీమేక్ హక్కుల కోసం కరణ్ జోహార్ ఏకంగా రూ.6 కోట్లు చెల్లించారని ఫిల్మ్ నగర్ టాక్. వాస్తవానికి సాజిద్ నడియాద్వాలా, భూషణ్ కుమార్, మురద్ ఖేతాని, విజయ్ గలాని వంటి బడా నిర్మాతలు ‘డియర్ కామ్రేడ్’ రీమేక్ హక్కుల కోసం పోటీపడ్డారట. వీరందరికీ షాక్ ఇస్తూ కరణ్ జోహార్ రూ.6 కోట్ల భారీ ధరకు ‘డియర్ కామ్రేడ్’ రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నారట. అయితే, ఈ సినిమా కోసం ఇంకా హీరోహీరోయిన్లను ఖరారు చేయలేదుని ఇటీవల కరణ్ జోహార్ ట్వీట్ చేశారు.

Tags:
Cinema News