ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మరో భారీ సినిమాకు శ్రీకారం చుట్టబడిన సంగతి తెలిసిందే.దాదాపు 1500 కోట్ల భారీ బడ్జెట్ తో 'రామాయణ' సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను ఇద్దరు డైరెక్టర్లు తెరకెక్కించబోతున్నారు. 'దంగల్' ఫేం నితేశ్ తివారీ, శ్రీదేవి ప్రధాన పాత్రలో వచ్చిన 'మామ్' డైరెక్టర్ రవి ఉద్యవార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. అల్లు అరవింద్ సహా నమిత్ మల్హోత్రా, మధు మంతెన ఈ సినిమా ను నిర్మించనున్నారు.
రామాయణ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మొత్తం మూడు పార్టులుగా రూపొందించ బోతున్న రామాయణ సిరీస్ మొదటి భాగాన్ని 2021లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా లీడ్ రోల్స్ విషయంలో ప్రభాస్, ఎన్టీఆర్ ల పేర్లు బయటకు రావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎన్టీఆర్ రౌద్రపూర్తిమైన రావణుడి పాత్రను ఎన్టీఆర్‌తో చేయించాలని యూనిట్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రావణుడి పాత్ర ఎన్టీఆర్‌కి మాత్రమే సూట్ అవుతుందని ఫిక్స్ అయ్యారట. అయితే ఇప్పటికే రాముడిగా రామ్ చరణ్‌ని సంప్రదించగా, ఆయన నో చెప్పగా, దీంతో ఆ పాత్ర ప్రభాస్ తో చేయించాలని అల్లు అరవింద్ ప్లాన్ వేస్తున్నారంటూ సోషల్ మీడియా సమాచారం.
ఇలాంటి భారీ ప్రాజెక్టులో ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి పెద్ద హీరోలు భాగమైతే ఇక జరిగే సంచలనాలు ఊహించగలమా. కానీ ఎన్టీఆర్ ప్రస్తుతం బిజీ బిజీ షెడ్యూల్స్‌లో ఓ వైపు RRR షూటింగ్ జరుగుతుండగానే.. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్టు ఓకే చేసుకున్నారు. మరోవైపు ప్రభాస్ కూడా నూతన సినిమాకు కమిట్‌మెంట్ ఇచ్చి ఉన్నాడు. సో చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో!

Tags:
Gossips