సోషల్‌మీడియాలో వైరల్‌గా మరీనా డార్లింగ్ ప్రభాస్ పెళ్లి టాపిక్!


సుజీత్ డైరక్షన్‌లో డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘సాహో’. ఈ సినిమా ఆగస్టు 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ అభిమానుల్లో సర్వత్ర ఆసక్తి నింపుతోంది.
ప్రభాస్ పెళ్లి అనేది టాలీవుడ్‌లో ఎప్పటినుంచో హాట్ టాపిక్‌గా ఉంది. మిర్చి సినిమా తర్వాత ప్రభాస్ బాహుబలి షూటింగ్‌లో బిజీ కావడంతో అప్పట్లో ఆ టాపిక్ గురించి ఎవరూ పట్టించుకోలేదు. అయితే బాహుబలి విడుదల తర్వాత మళ్లీ ప్రభాస్ పెళ్లి గురించి మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ వెంటనే ప్రభాస్ సాహో షూటింగ్‌లో పడిపోయాడు. అయితే సాహో విడుదల తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని వార్త మళ్లీ తెరపైకి వచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తెతో త్వరలో ప్రభాస్ వివాహం జరుగనుందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభాస్ సోదరి గతంలో ఓ ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చిందట.
అతనంటే మాకు చాలా ప్రేమ, గౌరవం. మాకు ఎప్పుడు గిఫ్ట్‌లు ఇస్తూ సర్‌ప్రైజ్ చేస్తుంటాడు. అతని పెళ్లి కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. ప్రస్తుతం అతను షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు కాబట్టి మేము పెళ్లి తేదీ గురించి కచ్చితంగా చెప్పలేము. కానీ అతని పెళ్లిలో గోల చేయాలని మేము ఆతృతగా ఉన్నాము’’ అని అన్నారు. అయితే ఇందుకు సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం లేకపోయినా.. ఈ న్యూస్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది