సంక్రాంతి రేసులో మొదట ఉన్న సినిమాలు ఇవే!

థియేటర్లు తెరుచుకోవడానికి ఈ నెలలో అనుమతులు ఇచ్చారు కానీ.చాలా తక్కువ సంఖ్యలో మల్టీప్లెక్స్ మాత్రమే రీఓపెన్  అయ్యాయి. అవి కూడా పేరుకి నడుస్తున్నాయి. 

Pocket Cinma News

థియేటర్ల సంగతి ఇలా ఉంటే సంక్రాంతి రేసు మాత్రం జోరుగా సాగుతన్నాయి. వరుసబెట్టి సంక్రాంతి రిలీజ్ అంటూ సినిమాలను ప్రకటించేస్తున్నారు. నితిన్ సినిమా 'రంగ్ దె' ను సంక్రాంతి రేసులో నిలబెడుతున్నట్లు టీజర్లో తెలుస్తుంది.

ఇక రానా దగ్గుబాటి సినిమా 'అరణ్య'ను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక దసరా సందర్భంగా రెండు సినిమాలు సంక్రాంతి విడుదలను ప్రకటించనున్నారు . అందులో ఒకటి రవితేజ సినిమా 'క్రాక్' కాగా.. మరొకటి రామ్ మూవీ 'రెడ్'. 

Pocket Cinema News

'రెడ్', 'అరణ్య'ఎప్పుడో ఫస్ట్ కాపీతో రెడీ అయిపోయింది. 'క్రాక్', 'రంగ్ దె' షూటింగ్ చివరి దశలో ఉంది. ఒకే సారి నాలుగు సినిమాలంటే ఇక వేరే సినిమాలకు అవకాశం లేనట్లే. కారణం అప్పటిలోగా అన్నీ థియేటర్లు మామూలుగా నడుస్తాయా లేదా అన్నదే అసలు విషయం. టాలీవుడ్ పరిస్థితి ఇలా ఉండగా. మరోవైపు కన్నడ సినిమా 'కేజీఎఫ్'ను సంక్రాంతికే రిలీజ్ చేయాలన్న ఆలోచనతో ఉన్నారంటా. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది