విజయ కృష్ణ గ్రీన్ స్టూడియో లాంఛ్

సూపర్‌ స్టార్‌ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో నిర్మాణ సంస్థ వచ్చేసింది. కృష్ణ స్థాపించిన పద్మాలయా స్టూడియోస్‌, మహేష్‌ బాబు స్థాపించిన జిఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సుధీర్‌ బాబు స్థాపించిన సుధీర్ బాబు ప్రొడక్షన్స్, రమేష్‌ బాబు స్థాపించిన కృష్ణా ప్రొడక్షన్స్‌ ప్రై లిమిటెడ్‌, మంజుల స్థాపించిన ఇందిర ప్రొడక్షన్స్ బ్యానర్లు కృష్ణ ఫ్యామిలీలో ఉన్నాయి. వీటిలో జిఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సుధీర్‌ బాబు ప్రొడక్షన్స్‌ మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా డాక్టర్ నరేష్, మరియు సూపర్ స్టార్ కృష్ణ మనవడు నవీన్ విజయ కృష్ణ కలిసి 'విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్ ప్రవేట్ లిమిటెడ్' పేరుతో కొత్త సంస్థను ప్రారంభించారు. 

Pocket Cinema News

ఈ సంస్థ సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల కలిసి 1972లో స్థాపించిన విజయ కృష్ణ మూవీస్ సంస్థనే ఇప్పుడు నరేష్‌, నవీన్‌ విజయ కృష్ణలు రీ లాంచ్‌ చేశారు. విజయ కృష్ణ మూవీస్ సంస్థలో 'మీనా, హేమా హేమీలు, అంతంకాదిది ఆరంభం..' వంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి. ఎన్నో సినిమాలు తీసి విజయ నిర్మల గిన్నిస్ బుక్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. సంస్థతో పాటు డబ్బింగ్ స్టూడియో, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ స్టూడియో, ఎడిట్ సూట్స్ మరియు ఔట్ డోర్ యూనిట్స్‌ను స్థాపించారు.

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది