త్రీవిక్రమ్ నెక్స్ట్ సినిమా హీరో యంగ్ ఎనర్జీటిక్ స్టార్ రామ్

అల్లు అర్జున్‌తో 'అలా వైకుంఠపురములో' సినిమా తర్వాత  త్రివిక్రమ్‌  తన తరువాత చిత్రం ఎన్టీఆర్‌తో ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్‌ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. కరోనా కారణంగా ప్లాన్  చేసిన షూటింగ్‌ షెడ్యూల్స్ అన్నీ మారిపోవడంతో, ఇంకా 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా షూటింగ్‌లోనే ఎన్టీఆర్‌ ఉన్నాడు. త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి చాలా టైమ్‌ పట్టేలా ఉండటంతో.  

Pocket Cinema News

త్రివిక్రమ్‌ రామ్ తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం రెడ్‌ సినిమా పూర్తి చేసిన రామ్‌తో త్రివిక్రమ్‌ సినిమా చేసేందుకు అన్ని కార్యక్రమాలు రెడీ అయ్యాయని, అధికారికంగా సినిమాను ప్రకటించడమే తరువాయి అనేలా ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. ఈ న్యూస్ పై అఫిసియల్గా ఎటువంటి అప్డేట్ ఇప్పటి వరకు రాలేదు. రామ్‌ నటించిన 'రెడ్‌' చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్‌ ప్రకటించింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది