నేను సింగల్ గానే ఉన్నా.. కానీ డేటింగ్ చేయాలనుంది: రాశిఖన్నా

‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు ఇండ్రస్ట్రికి ఎంట్రీ ఇచ్చిన రాశీఖన్నా. వెంకీమామ, ప్రతిరోజు పండగే, వరల్డ్ ఫేమస్ లవర్.. సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

Pocket Cinema News

సోమవారం తన 30వ పుట్టినరోజు సంధర్బంగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. తన లవ్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతూ.. ఎవరితోనైనా డేటింగ్ చేయాలని ఉందంటూ పెద్ద షాకిచ్చింది.

‘ప్రేమ సక్సెస్‌ అవ్వడం అనేది చాలా తక్కువ ఉంటుంది, ప్రేమలో ఫెయిల్యూర్సే ఎక్కువని... అలాంటి చేదు అనుభవం నాకు ఉందని రాశీఖన్నా ఇంతకు ముందు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పింది. తన పుట్టినరోజు ఆమెకు విషెస్ చెప్పిన నెటిజన్లు.. ఇప్పుడు ప్రేమలో ఉన్నారా? అంటూ అడిగారు.

‘ప్రస్తుతానికి నేను సింగిల్‌గానే ఉన్నా. నిజం చెప్పాలంటే ఎవరితోనైనా డేటింగ్‌ చేయాలని ఉంది. కానీ ఎందుకో ఆ వైపు వెళ్లలేకపోతున్నా అంటూ  చెప్పుకొచ్చింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది