పే ఫర్ వ్యూ పద్దతిలో 'డర్టీ హరి' కొత్త ATTలో విడుదల.

కరోనా సమయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ద్వారా అనేక సినిమాలు విడుదలయ్యాయి. ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కి మంచి ఆదరణ లభించింది. 

Pocket Cinema News

ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిచిన రొమాంటిక్ మూవీ డ‌ర్టీ హ‌రి. ఈ సినిమాలో రుహాని శ‌ర్మ‌, శ్ర‌వ‌ణ్ రెడ్డి, సిమ‌త్ర కౌర్ త‌దిత‌ర‌లు నటించారు. ఈ సినిమా టీజ‌ర్ కి సోష‌ల్ మీడియాలో విశేష ఆద‌ర‌ణ ల‌భించిది, ఈ నేప‌థ్యంలో డ‌ర్టీ హ‌రి చిత్రాన్ని కొత్త ఓటిటి ప్లాట్ ఫామ్ ఏటీటీ ద్వారా డిసెంబ‌ర్ 18న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు మొద‌లైయ్యాయి.

పే ఫర్ వ్యూ పద్దతిలో నడిచే ఈ కొత్త ఏటీటీ యాప్ కు తెలుగు ఆడియెన్స్ లో ప్రత్యేక స్థానం ఉంటుందన్న నమ్మకంతో, డర్టీ హరి చిత్రంతో పాటు ఇంకా పలు తెలుగు సినిమాలు ఈ కొత్త ఏటీటీ స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయి. ఫోన్ కాల్ చేస్తే చాలు సినిమా చూసే నూత‌న‌ విధానం రెడీ అవుతుంది. ఈ ఏటిటి కి ఇద్ద‌రు పెద్ద ద‌ర్శ‌కులు ప‌నిచేయ‌టం ప్రత్యేక విశేషం, ఈ ఏటిటి డిసెంబర్ 18న లాంచ్ చేస్తున్నారు డిసెంబ‌ర్ మెద‌టి వారం లో దీని గురించి అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది