హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయిలో 'సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్' నిర్మించే ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్

అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మిస్తామని, ఇందుకోసం 1500-2000 ఎకరాల స్థలాన్నిహైదరాబాద్ నగర శివార్లలో కేటాయిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. 

Pocket Cinema News

సినీ ప్రముఖులు, అధికారుల బృందం బల్గేరియాలో సినిమా సిటీని పరిశీలించి, సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశించారు. శనివారం మెగాస్టార్‌ చిరంజీవి, కింగ్‌ నాగార్జున ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి సినిమా పరిశ్రమ అభివృద్ధి- విస్తరణకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ.. ''తెలంగాణలో చిత్ర పరిశ్రమ ఆధారంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 10 లక్షల మంది ఆధారపడి ఉన్నారు. లాక్ డౌన్ వల్ల అటు షూటింగులు, ఇటు థియేటర్లు నడవక ఉపాధి కోల్పోయారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 91.88 శాతం ఉంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగులు, థియేటర్లు రీ స్టార్ట్ చేయాలి. చిత్ర పరిశ్రమపై ఆధారపడి బతికే కుటుంబాలను కష్టాల నుంచి బయట పడాలన్నారు.

Pocket Cinema News

హైదరాబాద్ నగరం కాస్మో పాలిటన్ సిటీ. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి- విస్తరణకు పుష్కలమైన అవకాశాలున్నాయి. ఇప్పుడున్న వాతావరణానికి తోడు ప్రభుత్వం సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మించాలనే ఆలోచనలో ఉంది. ప్రభుత్వం 1500-2000 ఎకరాల స్థలాన్ని సేకరించి ఇస్తుంది. అందులో అధునాతన సాంకేతిక నైపుణ్యంతో, అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోలు నిర్మించేందుకు సినిమా నిర్మాణ సంస్థలకు స్థలం కేటాయిస్తుంది. అన్నీ సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది అని తెలిపారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది