రామ్ చరణ్: రాజమౌళి, అలియా భట్ మరియు RRR యూనిట్ మొత్తానికి విసిరిన ఛాలెంజ్

రాబోయే తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలనే లక్ష్యంతో 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' ముందుకు తిసుకేల్లుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఎందరో సినీ, రాజకీయ ప్రముఖలు 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' అవసరాన్ని, గొప్పతనాన్ని తెలుపగా. తాజాగా రామ్ చరణ్ ఇందులో భాగమై మొక్కలు నాటారు.

Pocket Cinema News

ప్రభాస్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన రామ్ చరణ్. ఈ రోజు జూబ్లీహిల్స్‌లో తన నివాసంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ. నా స్నేహితుడు ప్రభాస్ ఈ 'గ్రీన్ ఇండియా చాలెంజ్' కార్యక్రమంలో పొల్గొనడమే కాకుండా నాకు 'గ్రీన్ ఇండియా చాలెంజ్' గుర్తు చేసి ఈ అవకాశాన్ని కల్పించడం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇది మన ప్రాధమిక కర్తవ్యం, అందరి బాధ్యత అని చెప్పారు.

 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ని అభినందిస్తూ, తాను దర్శకుడు రాజమౌళి, హీరోయిన్ ఆలియా భట్ లతో పాటు RRR యూనిట్ మొత్తానికి ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసురుతున్నానని అన్నారు. అంతే కాదు మెగా ఫ్యామిలీ అభిమానులంతా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది