రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కానుకగా రాధేశ్యామ్ నుంచి ఓ స్పెషల్ ట్రీట్ అభిమనులకి ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. ప్రభాస్ సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సంధర్బంగా రాధే శ్యామ్ మోషన్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. కేవలం నాలుగు రోజుల్లో 25 మిలియన్ ప్లస్ వ్యూస్ సాధించి. ఇండియన్ సినిమాలో అత్యధిక వ్యూస్ సాధించిన మోషన్ పోస్టర్‌గా రికార్డ్‌ను క్రియేట్ చేసినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.
ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరుగుతున్నా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయడానికి చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం అటు అభిమానులు, ఇటు ప్రేక్షకులు మరియు ఇండస్ట్రి వారు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Record breaking king #Prabhas
రిప్లయితొలగించండి