చైతన్య నిహారికల పెళ్లి ముహూర్త తేదీ ఖరారు

చైతన్య జొన్నలగడ్డ, నిహారిక కొణిదెల పెళ్లి వివరాలు తెలిపిన ప్రభాకర్ రావు. 

Pocket Cinema News

గుంటూరు ఐజీ జె.ప్రభాకర్‌ రావు తనయుడు చైతన్య జొన్నలగడ్డ, మరియు మెగాడాటర్‌ నిహారిక కొణిదెల వివాహానికి ముహూర్తం పెద్దలు ఖరారు చేశారు. డిసెంబర్‌ 9, రాత్రి 7 గంటల 15 నిమిషాలకు వివాహానికి ముహూర్తం ఖరారైనట్లు ప్రభాకర్‌ రావు తెలిపారు. తిరుమల వేంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని, స్వామి పాదాల వద్ద వివాహ పత్రికను ఉంచి ఆశీర్వాదం తీసుకున్న ప్రభాకర్‌ రావు దంపతులు పెళ్లి ముహూర్తం గురించిన మీడియా వారికి వివరాలను తెలిపారు. అలాగే పెళ్లిని రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌ విలాస్‌లో చైతన్య, నిహారికల పెళ్లి జరగబోతున్నట్టు ప్రభాకర్ రావు తెలిపారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది