రచన: నరేంద్రనాథ్
సంగీతం: థమన్
ఎడిటర్: తమ్మిరాజు
దర్శకత్వం: నరేంద్రనాథ్
నిర్మాత: మహష్ కోనేరు
విడుదల: 4-11-2020
ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ జగపతి బాబు, నరేష్, నవీన్ చంద్ర, నదియా, పూజిత పొన్నాడ ప్రదాన పాత్రల్లో నటించారు. మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ అయింది.
స్టోరీ :
ఒక సాదారణమైన మద్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిమానసా సంయుక్త (కీర్తి సురేష్). ఆమె చిన్నప్పటి నుండి బిజినెస్ చేయాలని కల కంటోంది. కొన్ని ఊహించని పరిస్థితుల వల్ల ఆమె ఫ్యామిలీ అమెరికా వెళ్లాల్సి వస్తుంది. అయితే సంయుక్త కలలు నెరవేర్చుకునేందుకు అమెరికాలో ఆమె మిస్ ఇండియా అనే ఒక చాయ్ బిజినెస్ ను స్టార్ట్ చేస్తోంది. కానీ, అమెరికాలో కాఫీ బిజినెస్ ను రూల్ చేస్తోన్న కైలాష్ (జగపతిబాబు) లాంటి ప్రత్యర్థులను తట్టుకుని నిలబడి చివరకు విజేతగా ఎలా నిలిచింది అన్నది మిగిలిన కథ.
సినిమాకి ప్లస్ :
ఒక హీరోయిన్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేటప్పుడు మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. తేడావస్తే ఉన్న మార్కెట్ పోతుంది. తరువాత లేడి ఓరియెంటెడ్ విషయంలో ఎంతో తపన ఉండాలి. కీర్తి సురేష్ అంతే తపనతో ఈ సినిమా చేసింది. పైగా ‘మిస్ ఇండియా’లో తన పాత్ర కోసం కీర్తి సురేష్ స్లిమ్ అయింది. ఈ సినిమాలో కీర్తికి తల్లిగా నదియా, సీనియర్ నరేష్ తండ్రిగా, కమల్ కామరాజు అన్నగా పాత్రలు పోషించారు.
రాజేంద్ర ప్రసాద్ తాతయ్య పాత్రలో నటించి అందరినీ మెప్పించారు. అలాగే నవీన్ చంద్ర, జగపతిబాబులు తమ పాత్రలకు వంద శాతం న్యాయం చేశారు. ఇక సమాజంలో ముందుకు వెళ్లాలనుకొనే అమ్మాయికి తన ఇంట్లో నుంచి వచ్చే వ్యతిరేకతను ఎదిరించి. ఒక అమ్మాయి వ్యాపారంలోకి అడుగుపెట్టి సక్సెస్ కావడం లాంటి కొన్ని సీన్స్ బాగున్నాయి. ఇక కీర్తి సురేష్, ప్రత్యర్థిగా జగపతిబాబుల మధ్య సీన్స్ బాగున్నాయి.
సినిమాకి మైనస్ :
కొన్ని సీన్స్ బాగా స్లోగా సాగడం, అలాగే మెయిన్ పాయింట్ ఎలివేట్ చెయ్యకుండా పూర్తి రొటీన్ ప్లే లో స్క్రీన్ ప్లేని సాగతీయడం. దర్శకుడు నరేంద్రనాధ్ కథకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ దగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోలేదు. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించినా,
సెకెండాఫ్ లో కొంచం స్లో అనిపిస్తుంది, దర్శకుడు మాత్రం ఆడియన్స్ ని తను అనుకున్న ల్యాగ్ డ్రామాని ఎలివేట్ చెయ్యటానికే ఎక్కువు ఆసక్తి చూపించాడు. దాంతో సీన్స్ బోర్ గా సాగి సినిమా పై ఆసక్తిని నీరుగారుస్తోంది.
టెక్నికల్ :
సినిమా క్వాలిటీ పరంగా చూసుకుంటే. సినిమాని విజువల్ గా ఆకట్టుకునేలా తెరకెక్కించారు. కెమెరామెన్ కొన్ని కీలక సన్నివేశాలల్లో చాలా బాగా చేశారు. సంగీత దర్శకుడు తమన్ అందించిన సంగీతం మరియు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగా ట్రై చేసుంటే బాగుండేది. ఎడిటింగ్ సినిమసకి పెద్ద మైనస్. నిర్మాత మహేశ్ కొనేరు కథానుగుణంగా ఆయన సినిమాను చాలా రిచ్ ప్రొడక్షన్ వేల్యూస్‌తో నిర్మించారు.
