మాట మార్చిన పవన్ కల్యాణ్, షాక్ లో అభిమానులు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు జీహెచ్ఎంసీ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నారు. 

Pocket Cinema News

రెండు రోజుల క్రితం మంగళగిరి వెళ్లిన పవన్ కల్యాణ్ అభిమానులు, కార్యకర్తలతో సమావేశమై వారి కోరిక మేరకు గ్రేటర్ ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు ప్రకటించారు. అభ్యర్థులంతా నామినేషన్లు వేయాలని కోరారు. దీంతో హైదరాబాద్ లో ఉన్న పవన్ అభిమానులు ఎన్నికల పనుల్లో నిమగ్నమయ్యారు. కొందరు నామినేషన్లు కూడ వేశారు.

కానీ ఈరోజు ఉన్నట్టుండి పవన్ కల్యాణ్ నామినేషన్లను ఉపసంహరించుకోమని తెలపడంతో అందరూ షాకయ్యారు. రెండు పార్టీలు కలిసి పోటీచేయాలని అనుకున్నా, కానీ కరోనా పరిస్థితులు వలన కుదరలేదు, ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవాల్సిన అవసరం ఉంది, ఒక్క ఓటు కూడ బయటకు పోకుండా ఉండాలనే ఉద్దేశంతో పోటీని విరమించుకుంటున్నాం అని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ బీజేపీ నేతలతో సమావేశమైన ఆయన ఎన్నికల నుండి తప్పుకొంటున్నాం, భాజాపాకు మద్దతిస్తున్నామని అంటూ అలాగే బీజేపీకి సంపూర్ణ మద్దతివ్వాలని అభిమానులకు సూచించారు. పవన్ ఇలా ఉన్నటుంది పోటీ నుండి తప్పుకోవాలని కోరడంతో చాలామంది ఫ్యాన్స్ కు నిరాశ పరచింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది