'ఆచార్య' షూటింగ్ లో భర్తతో హాల్ చల్ చేసిన కాజల్ అగర్వాల్ - నవ దంపతులను ఆశీర్వదించిన చిరంజీవి

ఇటీవలే మాల్దీవుకి హనీమూన్ వెళ్లొచ్చిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. పెళ్లి తరువాత మొదటి సారిగా సెట్స్‌పై చేరింది. ఏకంగా తన భర్త గౌత‌మ్ కిచ్లూని తీసుకొని తన లేటెస్ట్ మూవీ 'ఆచార్య' సెట్స్‌కి వచ్చింది. నవ దంపతులను ఆహ్వానం చేసిన మెగాస్టార్ చిరంజీవి వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.

Pocket Cinima News

హైద‌రాబాద్ లోని కోకాపేటలో వేసిన భారీ సెట్లో 'ఆచార్య' షూటింగ్ జరుగుతోంది. చిరంజీవి, కాజ‌ల్ పై పాట చిత్రీకరణ చేయనున్నారు. దీంతో కాజ‌ల్ అగర్వాల్, గౌతమ్ జంట‌కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త జంటతో దండ‌లు మార్పించి కేక్ కట్ చేయించారు.

Also Read: విడుదలకు ముందే సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన 'వకీల్ సాబ్'

కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త సమర్పణలో ఎస్. నిరంజన్ రెడ్డి నిర్మాణంలో 'ఆచార్య' మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో చిరంజీవి, కాజల్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్యపాత్ర పోషించటం విశేషం. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో ఈ సినిమా కథాంశం ఉండనుందని టాలీవుడ్ టాక్. ఇందులో చిరంజీవి డూయల్ పాత్రలో కనిపించడంతో చిరంజీవి అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది