ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానులు రెండు వర్గాలుగా చీలిపోయారు. దీనికి కారణం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా వదలిన పోస్టర్ హైలెట్ అవ్వడం, ఎన్టీఆర్ పోస్టర్కు నెగటివ్ కామెంట్స్ రావడంతో అసలు కథ మొదలైందని వినిపిస్తుంది. ఇదే కారణంగా ఒకరి ఫ్యాన్స్ మరొకర హీరోపై దారుణమైన ట్రోలింగ్‌కు మొదలైంది.
మన ఇండియాలో ఫ్యాన్స్ వార్ అన్నది సహజం. తమ హీరోలే తమ ఇంటిని పోషింస్తున్నటు ఫీలై ఇక్కడ ఉన్న సమస్యలు గాలికి వదలి తమ హీరోను ఎవ్వరైనా సరే తక్కువ చేసినట్టు మాట్లాడితే, ఫాన్స్ కౌంటర్లతో రెచ్చిపోతుంటారు. ఎప్పుడైతే సోషల్ మీడియా వాడకం వచ్చిందో ఇలాంటి ఫ్యాన్స్ వార్ మరీ ఎక్కువయ్యాయి.
Also Read: ఎన్టీఆర్ పుట్టినరోజు సర్‌ప్రైజ్గా నందమూరి అబిమానులకి రాజమోళి ట్రీట్
తాజా విషయం ఏమిటంటే FanBaseLessRamCharan, FanBaseLessNTR అనే హ్యాష్ ట్యాగ్‌లతో అభిమానులు రెచ్చిపోతోన్నారు. ఒకరిని మించి మరొకరు ట్రెండ్ చేసేందుకు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.
నిన్న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీం వదిలిన పోస్టర్ ఎంతగా ట్రోలింగ్‌కు గురైందో అందరికీ తెలిసిందే. రాజమౌళి నుంచి ఇలాంటి పోస్టర్ ఊహించలేదంటూ సగటు సినీ ప్రేక్షకుడు సైతం పెదవి విరిచారు. ఇక అభిమానుల పరిస్థితి ఐతే నోరు దాటిపోయింది.
ట్విట్టర్‌లో చెర్రీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ దారుణమైన ట్రోలింగ్‌కు ఎగబడుతున్నారు. రామ్ చరణ్ పాత ఫోటోలను షేర్ చేస్తుండగా. ఇక ఎన్టీఆర్ లావుగా ఉన్ననాటి ఫోటోలను షేర్ చేస్తూ చెర్రీ ఫ్యాన్స్ వార్ స్టార్ట్ చేశారు. పోస్టర్ల తేడకే ఫ్యాన్స్ వార్‌కు దిగుతూ ఉంటే. సినిమా విషయంలో ఏ కాస్త తేడా కొట్టినా ఫ్యాన్స్ మాత్రం థియేటర్లు బద్దలు కొట్టేలా తెలుస్తుంది.

