‘కేజీఎఫ్’-2 టీజర్ డేట్ ఖరారు చేసిన నిర్మాత

భారతీయుల సినిమా చరిత్రను తిరగరాసిన సినిమా అంటే అది ‘బాహుబలి’.  తరువాత ఆ రేంజ్ లో భారతీయ ప్రేక్షకులు ఎదురు చూసిన సినిమా ‘కేజీఎఫ్’. 

Pocket Cinema News

ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్ద సంచలనాలు క్రియేట్ చేసింది. కన్నడ సినిమా ఇతర భాషల్లో రిలీజవడమే గొప్ప అనుకున్న రోజులు పోయి,  తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఆ సినిమా అదిరిపోయే వసూళ్లు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన రోజులు వచ్చాయి.

‘కేజీఎఫ్’ చాప్టర్-2 కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు బారతీయ ప్రేక్షకులు. ఈ దసరాకే రిలీస్ కావలిసిన సినిమా కోరాన కారణంగా ఆగిపోయింది. లాక్ డౌన్ తర్వాత సాధ్యమైనంత త్వరగా సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్. కనీసం టీజర్ అయినా విడుదల చేయాలని ఈ సినిమా అభిమానులు కోరగా.

టీజర్ విషయంలో నిర్మాత కార్తీక్ గౌడ స్పష్టత ఇచ్చారు. జనవరి 8న యశ్ పుట్టిన రోజు కానుకగా టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. పరిస్థితులు అనుకూలిస్తే వేసవిలో ఈ సినిమా రిలీజయ్యే అవకాశముంది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది