ఒక్క డైలాగ్ తో హైప్ క్రియేట్ చేసిన 'జాంబీ రెడ్డి' టీజర్

జాతీయ అవార్డు గ్రహీత డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 'అ!','కల్కి' తరువాత త‌న మూడో సినిమాగా 'జాంబీ రెడ్డి' అనే మరో డిఫరెంట్ మూవీ రూపొందించారు. 

Pocket Cinema News

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ సినిమా టీజర్‌ను ఫస్ట్‌ బైట్‌ రూపంలో హీరోయిన్ సమంత తాజాగా విడుదల చేశారు.

ఒక్క నిమిషమున్న వీడియోతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు. ''దైవం మనుష్య రూపేణ అనేది ఇతిహాసం.. రాక్షసం మనుష్య రూపేణ అన్నది ప్రస్తుతం. దైవం అద్భుత సృష్టిలో ఒకే ఒక పొరపాటు మనిషికి మేధాశక్తిని ఇవ్వడం. ఆ మేధాశక్తి తనకే ఓ ప్రశ్నగా నిలిస్తే.. దైవం నేర్పే గుణపాఠం మనిషి ఉనికికే ప్రమాదం" అనే డైలాగ్ సినిమాపై గట్టి హైప్ క్రియేట్ చేస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్‌కి హైలైట్గా నిలిచింది. జాంబీలు, కోవిడ్‌ ఇంజెక్షన్స్ చూపించి సినిమాపై పెద్ద క్యూరియాసిటీ పెంచారు.

యాపిల్‌ ట్రీ స్టూడియోస్‌ బ్యానర్లో రాజ్‌ శేఖర్‌ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కర్నూలు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అటు దైవ శక్తికి, ఇటు సైన్స్‌కి జరిగే వార్ లా చిత్రకరిస్తున్నట్టు తెలుస్తుంది. చిత్రంలో తేజ సజ్జా, ఆనంది, దక్షా నగార్‌కర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా మొట్ట‌మొద‌టి తెలుగు జాంబీ ఫిల్మ్ కావ‌డం విశేషం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది