RRR all time record: ఓవ‌ర్‌సీస్‌లో కొత్త రికార్డు.. నౌ స్టార్ట్ 'ఆర్ఆర్ఆర్' హంటింగ్

RRR all time record: యు.ఎస్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన RRR. సినిమా బుకింగ్స్ స్టార్ట్ అయిన కొన్ని గంట‌ల వ్యవధిలోనే ఓవ‌ర్ సీస్‌లో ఆల్ టైమ్ రికార్డ్. 

NTR

రాజ‌మౌళి ద‌ర్శ‌కత్వంలో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ టాలీవుడ్ టాప్ హీరోలతో రూపొందిన చిత్రం RRR. ఎంటైర్ ఇండియా ఈ మూవీ రిలీజ్ కోసం ఎంతో అంచనాలతో ఎదురుచూస్తున్న సంగతి అందరికీ తెలుసు. వచ్చే ఏడాది 2022 సంక్రాంతి సంద‌ర్భంగా చిత్రాన్ని జ‌న‌వ‌రి 7న రిలీస్ చేయ‌డానికి అన్నీ ఏర్పాటు వేగంగా జ‌రిగిపోతున్నాయి. రాజ‌మౌళి దర్శకత్వంలో బాహుబ‌లి త‌ర్వాత  వ‌స్తోన్న భారీ సినిమా కావ‌డంతో RRR పై అంచ‌నాలు ఆకాశాన్ని తాకాయి. బాహుబ‌లి కలెక్షన్స్ ప‌రంగా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేసింది అందరికీ తెలుసు. 

అయితే ప్రస్తుతం RRR కలెక్షన్స్ పై అందరి ద్రుష్టి మళ్ళింది. RRR ఎలాంటి రికార్డును క్రియేట్ చేయబోతుందోని ట్రేడ్ వ‌ర్గాలు పెద్ద అంచనాలతో ఎదురు చూస్తుండడం విశేషం. ఈ సినిమా రిలీజ్‌కు ముందుగానే కలెక్షన్స్ లో స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింద‌నే వార్తలు అయితే జోరుగా  వినిపిస్తున్నాయి. ఈ రికార్డు కూడా ఇండియాలో కాదు ఓవ‌ర్‌సీస్‌లోనట.

RRR సినిమా జ‌న‌వ‌రి 7న విడుద‌ల కాగా. ఓవ‌ర్‌సీస్‌లో ఓ రోజు ముందు, అంటే జ‌న‌వ‌రి 6న యు.ఎస్‌లో ప్రీమియ‌ర్ షోస్ రిలీజ్ కానున్నాయి. ప్రస్తుతం యు.ఎస్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది RRR. సినిమా బుకింగ్స్ స్టార్ట్ అయిన కొన్ని గంట‌ల వ్యవధిలోనే  175000 డాల‌ర్స్‌ను కలెక్షన్స్ చేసిందీ RRR.  ఈ మూవీ ఓవ‌ర్ సీస్‌లో ఈ కలెక్షన్స్ ఆల్ టైమ్ రికార్డ్ చేసినట్టు ట్రేడ్ వ‌ర్గాల ప్రస్తుత సమాచారం. ఇక ముందు ముందు ఇలాంటి ఎన్ని రికార్డులు క్రియేట్ చేయబోతుందో వేచి చూడాలి.

RRR

బాలీవుడ్ లో RRR మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం ఘనంగా ముంబైలో జరగనుంది. ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ రానున్నారు అన్నది విశేషం. ఆల్రెడీ చిత్ర యూనిట్ మొత్తం ముంబై చేరుకుంది. ఈ సినిమా ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ గా 1920 బ్యాక్ డ్రాప్‌లో జరిగే విదంగా స్క్రీన్లో చూపనున్నారు.  ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్‌ గోండు వీరుడు కొమురం భీమ్‌గా స్క్రీన్ పై కినిపించనున్నారు . చరిత్రలో వీరిద్దరూ ఎక్కడ ఎప్పుడు క‌లుసుకోని ఇద్ద‌రు యోధులు బ్రిటీష్ వారిపై తిరగబడితే ఎలా ఉంటుంద‌నే పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  ఈ మూవీని నాలుగు వంద‌ల కోట్ల బడ్జెట్ లో డి. వి. వి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి. వి. వి దాన‌య్య నిర్మించారు.  ఇందులో అజ‌య్ దేవ‌గ‌ణ్, ఆలియా భ‌ట్‌, రే స్టీవెన్ స‌న్, ఆలిస‌న్ డూడి, ఒలివియా మోరిస్ న‌టించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది