RGV: నువ్వు ఇలా చేయడం నేను నమ్మలేకపోతోన్నా - మంచు లక్ష్మీపై రామ్ గోపాల్ వర్మ కామెంట్లు

RGV: అవును నా వల్ల కానిదంటూ ఏమీ లేదు. ఒక నటిగా నేను ఏదైనా చేయగలను. నేను ఎప్పుడూ చెప్పేవిధంగా నేను ఆర్టిస్టిక్ కిల్లర్‌నే అంటూ మంచు లక్ష్మీ, రామ్ గోపాల్ వర్మకు రిప్లై చేసింది.

RGV

ఈ మధ్య మంచు లక్ష్మీ కొత్త విద్యలు నేర్చుకుంటోంది. గత రెండు మూడు రోజుల నుంచి కలరిపట్టు విద్యలో శిక్షణ తీసుకుంటున్న వీడియోలను మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఈ కలరిపట్టు కేరళ ప్రాచీనత విద్య ను మంచు లక్ష్మీ నేర్చుకుంది. అయితే ఇది దేనికోసం నేర్చుకుంటుందన్నది తెలియదు. కొందరు సినిమా ఫిట్ నెస్ కోసం అంటున్నారు . మరి కొందరు మంచు లక్ష్మీ ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నానంటూ, ఆ సినిమా కోసమే ఇలా కలరిపట్టు విద్యను నేర్చుకుంటున్నట్టు టాలీవుడ్ టాక్.

హేయ్ నీకు హద్దులనేవే లేవా?.. నువ్వు ఇలా చేయడం నేను నమ్మలేకపోతోన్నా.. ఇది ఎవరో చెప్పని వారికి లక్ష రూపాయలు ఇవ్వను అంటూ మంచు లక్ష్మీ ట్రైనింగ్ సెషన్ ఫోటో మీద రామ్ గోపాల్ వర్మ కామెంట్లు చేశాడు. రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్ల మీద మంచు లక్ష్మీ స్పందించింది. ఈ రోజుకు నా జీవితానికి ఇది నాకు చాలు. నన్ను మీరు పొగిడేశారు. ఎస్ నా వల్ల కానిదంటూ ఏమీ లేదు. ఒక నటిగా నేను ఏదైనా చేయగలను. నేను ఎప్పుడూ చెప్పేవిధంగా నేను పెద్ద ఆర్టిస్టిక్ కిల్లర్‌నే అంటూ మంచు లక్ష్మీ రామ్ గోపాల్ వర్మకు రిప్లై చేసింది.


RGV


అయితే మొత్తానికి మంచు లక్ష్మీ ట్రైనింగ్ సెషన్ మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. మామూలుగానే రామ్ గోపాల్ వర్మ ట్వీట్కి, మంచు లక్ష్మీ ట్రోల్స్‌కు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. అలాంటిది ఇప్పుడు ఇద్దరూ ఇలా ట్వీట్లలో ట్వీట్ చేసుకోవడంతో సోషల్ మీడియాలో అందరూ ఆసక్తికి చూస్తున్నారు. ఇంత జరిగిన మంచు లక్ష్మీ మాత్రం తన కలరిపట్టు ట్రైనింగ్ ఎందుకోసమో చెప్పలేదు.

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది