RRR Trailer: సినిమా ట్రైలర్‌కే ఇలా రికార్డ్ క్రియేట్ చేస్తే.. ఇక సినిమా రిలీజ్ తర్వాత రికార్డులు ఎలా క్రియేట్ అవుతాయో చూడాలని భారతదేశ ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఏంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
భారతదేశ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎంతో భారీ అంచనాలతో ఎదురు చూస్తోన్న చిత్రం RRR. టాలీవుడ్ టాప్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటించడంతో పాటు. రాజమౌళి దర్శకత్వం కావడంతో సినిమాపై ఉన్న అంచనాలకు ఆకాశాన్ని తాకాయి. మరో వైపు బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్ వంటి వారు కూడా RRRలో ముఖ్య పాత్రల్లో నటించడం కూడా పెద్ద కారణాలుగా చెప్పొచ్చు. ఇవన్నీ ఒక పక్క ఉంటే మరో వైపు బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్ స్థాయిలో నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి డైరక్టర్ కావడం మరో పెద్ద ఎత్తు సినిమాకి. ఎందుకంటే రాజమౌళి ఎంచుకున్న కాన్సెప్ట్ తో పాటు కాంబినేషన్ అటువంటిది మరి. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ రోజు నుంచే సినిమాపై ఇండియా మొత్తం ఎవరూ ఊహించలేనంత అంచనాలు నెలకొన్నాయి.
చరిత్రలో గోండు వీరుడు కొమురం భీమ్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కలుసుకున్నట్టు లేదు. అయితే వీరిద్దరూ కలిసి ఉండుంటే, వారి భావన అంచనాలు పరస్పరం పంచుకుని. దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదిరిస్తే ఎలా ఉంటుందో అనే ఊహాత్మక కథ అంశంతో RRRను తయారు చేసిన, ఈ చిత్రం రాజమౌళి అండ్ టీం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా జనవరి 7న భారీ ఎత్తున పాన్ ఇండియా సినిమాగా విడుదలకు సిద్దం చేస్తున్నారు. ఇందులో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించారు.
ప్రస్తుతం రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, ఆలియా భట్, దానయ్య, అజయ్ దేవగణ్, సముద్రకని, టీమ్ మొత్తం ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. గత గురువారం, అంటే డిసెంబర్ 9న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. భారతదేశంలో మరే సినిమా సాధించని సరికొత్త రికార్డును RRR మూవీ ట్రైలర్ క్రియేట్ చేసింది. అంటే ప్రేక్షకులకు ఈ సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయనే విషయం ట్రైలర్ చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఐదు భాషల్లో కలిపి ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 51.1 మిలియన్ వ్యూస్‌ను సాధించింది.
తెలుగు - 20.23 మిలియన్స్ - హిందీ - 19.08 మిలియన్స్ - కన్నడ - 5.16 మిలియన్స్ - తమిళం - 3.21 మిలియన్స్ - మలయాళం- 2.40 మిలియన్స్. అన్నీ భాషలు కలిపి మొత్తంగా 51.1 మిలియన్స్ వచ్చాయి. సినిమా ట్రైలర్‌కే ఇలా రికార్డ్ క్రియేట్ చేస్తే.. ఇక సినిమా రిలీజ్ తర్వాత రికార్డులు ఎలా క్రియేట్ అవుతాయో చూడాలని భారతదేశ ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఏంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.