మలయాళలో మోహన్ లాల్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘లూసిఫర్’. ఈ చిత్రాన్ని తెలుగు రీమేక్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న సంగతి అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం ‘ఆచార్య’ షూటింగ్ లో బీసీగా ఉన్నా చిరంజీవి. తాజాగా తన 153వ చిత్రంగా ‘లూసిఫర్’ రీమేక్‌ను ట్రాక్ ఎక్కించే పనిలో ఉన్నారు మెగాస్టార్. ఈ చిత్రానికి దర్శకుడిని తాజాగా ఫైనల్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతి తర్వాత షూటింగ్ వెళ్లేందుకు సిద్ధం చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా గురించి మాట్లాడుతూ.. లూసిఫర్ సినిమా రీమేక్ స్క్రిప్టు ఫైనల్ అయ్యింది. ‘తనిఒరువన్’ ఫేం మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారు. మన నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్టును మోహన్ రాజా రెడీ చేశాడు. సంక్రాంతి తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో జరిగే షూటింగ్‌తో సినిమా మొత్తం పూర్తవుతుంది. నా చిరకాల సన్నిహితులు ఎన్.వి. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read: ఆ గుర్తు కావాలని కోరిన రజినీకాంత్.. నిరాకరించిన ఎన్నికల కమిషన్
ప్రముఖ ఎడిటర్ మోహన్ వారసుడు మోహన్ రాజా. ఆయన తెలుగు సినిమాల్ని తమిళంలోకి రీమేక్ చేసి బ్లాక్ బస్టర్లు చేసిన రికార్డ్ తనకు ఉంది. దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ.. ‘‘మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ‘హిట్లర్’ చిత్రానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. ఇప్పుడు ఆయనను డైరెక్ట్ చేసే అవకాశం దక్కడం నా పూర్వజన్మ సుకృతం అని తెలిపారు.
Also Read: 'ఆచార్య' షూటింగ్ లో భర్తతో హాల్ చల్ చేసిన కాజల్ అగర్వాల్ - నవ దంపతులను ఆశీర్వదించిన చిరంజీవి
ఈ సినిమా గురించి నిర్మాత ఎన్.వి. ప్రసాద్ మాట్లాడుతూ.. చిరంజీవి గారితో సహ మా అందరికీ నచ్చేలా మార్పులు చేర్పులతో ఎంతో అద్భుతంగా ఈ స్క్రిప్టును మలిచి అందరినీ మోహన్ రాజా మెప్పించారు. రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తాం’’ అని తెలిపారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, ఎన్.వి.ఆర్. సినిమా సంయుక్తంగా నిర్మించనున్నరు.