ఎర్రచందనం అక్రమ రవాణా కోసం మారేడుపల్లి ఆడవుల్లోకి వెళ్తున్న 'పుష్ప'

అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో చిత్రీకరిస్తున్న 'పుష్ప' మారేడుపల్లి అడవులలో త్వరలో షూటింగ్ ప్రారంభం. 

Pockt Cinema News

మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో సుకుమార్ అల్లు అర్జున్‌ కాంబినేషన్లో 'పుష్ప' తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందుకోసం మారేడుమిల్లి ఆడవుల్లో షూటింగ్ కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 

Also Read: ఇటలీలో ప్రభాస్ ఫాన్స్ ఆసక్తిని చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ కావడంతో ఈ చిత్రాన్ని ఎక్కువ శాతం అడవుల్లోనే చిత్రీకరించాల్సి ఉంది. అందువల్ల మారేడుమిల్లి అడవుల్లో నెల రోజుల పాటు కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడా షూట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో అల్లు అర్జున్‌ పుష్పరాజ్‌ అనే యువకుడిగా పాత్రలో ప్రేక్షకులను అలరించేందుకు అల్లు అర్జున్ పాత్రగానే మారినట్టు మనకు తెలుస్తుంది. 

Also Read:  కొత్త రికార్డు క్రియేట్ చేసిన 'రాధేశ్యామ్' మోషన్ పోస్టర్

పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందబోతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన రష్మిక మందానా నటిస్తోంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్, రష్మిక మందాన చిత్తూరు యాసలో ట్రైనింగ్‌ తీసుకొంటున్నారని ప్రత్యక సమాచారం.  


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది