ప్రభాస్ రేంజ్ తెలిపేలా బర్త్ డే సీడీపీ రిలీస్ సంబరాలు

 అక్టోబర్ 23వ తేదీన యంగ్ రెబల్ స్టార్ బర్త్ డే సందర్బంగా ప్రభాస్ బర్త్ డే రేంజ్ తెలిపేలా బర్త్ డే సీడీపీ రిలీస్ చేశారు. 

తమ ఫేవరైట్ హీరో పుట్టినరోజు అంటే అభిమానులకు అంతకన్నా పెద్ద పండుగ రోజు ఉండదు. కేట్ కటింగ్స్, భారీ హోర్డింగ్స్ ఏర్పాట్లు చేయడం లాంటివి చేస్తూ ఆనందంలో మునిగితేలుతుంటారు ఫ్యాన్స్. అయితే ఈ మధ్యకాలంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కడం, దేశంలోని ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి రావడంతో మరో అడుగు ముందుకేసి (కామన్ డిస్ప్లే పిక్చర్) CDP లతో సోషల్ మీడియాలో హాల్ చల్ చస్తుంటారు.
Pocket Cinema News

ఈ నేపథ్యంలోనే మరో రెండు రోజుల్లో (అక్టోబర్ 23వ తేదీన) యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన బర్త్ డే సీడీపీ రిలీజ్ చేశారు. ఇక ప్రభాస్ రేంజ్ తెలిపేలా బర్త్ డే సీడీపీని బయటకు వదిలారు. ఈ బర్త్ డే సీడీపీని పరిశీలిస్తే ఇందులో అశేష అభిమానుల నడుమ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్‌ని చూపిస్తూ వరల్డ్ స్టార్ కీర్తిని చాటిచెప్పే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. దీంతో ఈ సీడీపీ నెట్టింట వైరల్ అవుతోంది. ఆయనకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ మరియు సెలబ్రెటీస్ అడ్వాన్స్ శుభాకాంచలు తెలియచేస్తున్నారు. పోతే ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన బాహుబలి 2 చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాతోపాటు ఇతర దేశంలో కూడా ఈ సినిమాను అక్టోబర్ 23వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది