సాహో యూనిట్ మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న చిత్రం `సాహో`. సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రం ట్రైల‌ర్‌, టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేసి ఇప్ప‌టికే ప‌లు పోస్ట‌ర్ల‌ను రిలీజ్ చేసిన యూనిట్ ఇప్పుడు మ‌రో కొత్త‌ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.
ఇటీవ‌ల ఓ రొమాంటిక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన చిత్ర‌బృందం  ఇప్పుడు ఫుల్ యాక్ష‌న్ మోడ్‌లో ఉన్న పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. ప్ర‌భాస్‌, శ్ర‌ద్ధ తుపాకీలు ప‌ట్టుకుని ప్ర‌త్య‌ర్థుల‌పై ఫైరింగ్ చేస్తున్న‌ పోస్ట‌ర్‌ను రివీల్ చేసింది. ఆగ‌స్టు 30న ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది