యూఎస్ లో డియార్ కామ్రేడ్ ప్రీమియర్ షోలు ఒకరోజు ముందుగా ప్రదర్శించబోతున్నారు

దేవరకొండ నటించిన తాజా చిత్రం 'డియార్ కామ్రేడ్' ఈ సినిమా అన్ని భాషలో జూలై 26 న రిలీజ్ కానుంది.  యూఎస్ లో ప్రీమియర్ షోలు ఒకరోజు ముందుగా జులై 25 న ప్రదర్శించబోతున్నారు. విజయ్ క్రేజ్ ను బట్టి ఈ సినిమాకు యూఎస్ లో మంచి స్పందన ఉందని సమాచారం.
ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ఓపెన్ కావడంతో విజయ్ సినిమాల్లో అత్యధిక యూఎస్ ప్రీమియర్ కలెక్షన్స్ సాధించిన రికార్డు 'గీత గోవిందం' పేరిట ఉంది. 'డియర్ కామ్రేడ్' ప్రీ సేల్స్ ట్రెండ్ చూస్తే మంగళవారం నాటికి 138 లోకేషన్స్ నుండి $150K  టికెట్ ప్రీ సేల్స్ గ్రాస్ కలెక్షన్స్ నమోదయ్యాయి. 
ఈ సినిమాను అమెరికాలో పంపిణీ చేస్తున్న సరిగమ సినిమాస్ వారు భారీ స్థాయిలో 200 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు.  పోటీలో చెప్పుకోదగ్గ సినిమాలు కూడా లేవు కాబట్టి ఈ సినిమా ప్రీమియర్ కలెక్షన్స్ 'గీత గోవిందం' ప్రీమియర్ కలెక్షన్స్ మార్క్ ను టచ్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది