ఆంధ్రప్రదేశ్‌లో కొద్ది రోజులుగా ముందు కురిసిన అతి భారీ వర్షాల కారణంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. నిరాశ్రయులయిన ప్రజలు సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
ఇలాంటి పస్థితిలో నష్టాలలో కష్ట పడుతున్న ప్రజలులకు సాయం చేయడానికి, సినీ రంగం ఎప్పుడూ ముందుంటుంది. ఈసారి కూడా సినీ పరిశ్రమ ప్రజలకు అండగా నిలబడటానికి ముందుకు వచ్చింది. టాలీవుడ్ లో ఎన్టీఆర్మ, హేశ్ బాబు, మెగాస్టార్ చిరంజీవి వరద బాధితుల కోసం తలా రూ.25 లక్షలు విరాళాన్ని అందిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా సందేశాన్ని ప్రకటించారు.
టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పాతిక లక్షల రూపాయల విరాళంగా అందచేయనున్నట్లు తెలిపారు. ‘‘ఇటీవల కురిసిన అకాల వర్గాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వరదలు వచ్చాయి. వాటి కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి సాయం చేసే దిశగా నేను చిన్న అడుగు ముందుకు వేసాను. అందులో భాగంగా ఏపీ సీఏం రిలీఫ్ ఫండ్ రూ.25 లక్షలు విరాళం అందిస్తున్నాను’’ అని ఎన్టీఆర్ తెలిపారు.
మెగాస్టార్ తన ట్విట్టర్ లో ‘‘ఆంధ్రప్రదేశ్‌లో వరదల విపత్తు బాధిత కుటుంబాలకు నావంతు సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. 25 లక్షలు విరాళం ప్రకటిస్తున్నాను’’ అని చిరంజీవి ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ లో వినాశకరమైన వరదలు సంభవించాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారి కోసం నా వంతుగా రూ.25 లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నాను. ఇది సంక్షోభ సమయం ఒకరికొకరు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ ముందుకు వచ్చి కష్ట పడే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సాయం చేయండి’’ అని మహేశ్ బాబు తన ట్విట్టర్ లో సందేశం పంపారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారికి పంట నష్టం.. ఆస్థి నష్టం జరిగిందని, తక్షణ కేంద్ర ప్రభుత్వం కొంత సాయాన్ని అందించాలని వై.ఎస్.జగన్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసింది. రాయలసీమలో కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలోనూ అకాల వర్షాలతో ముంచెత్తాయి. ప్రజలకు ఆస్థి, ప్రాణ, పంట నష్టం సంభవించాయి. రహదారులు దెబ్బతిన్నాయి. వరదల కారణంగా దాదాపు 85 లక్షల హెక్టార్లలోని పంట పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. సుమారు ఆరువేల కోట్లకు పైగానే వరద నష్టం సంభవించిందని ప్రభుత్వం అంచనా వేసింది.