Pushpa: టాలీవుడ్ లో ఈ సారి అల్లు అర్జున్ సోషల్ మీడియా రికార్డులతో సరిపెట్టుకోలేదు కొత్తగా బుక్ మై షోలో రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు.
2021 చివరి దశలో ఉన్నాం. ఈ ఏడాది ప్రారంభంలో క్రాక్ సినిమా హిట్ తరువాత ఉప్పెన సినిమా ఓ రేంజ్ లో ఉపేసింది. ఆ తర్వాత డిసెంబర్ నెలలో అఖండ హల్చల్ చేసింది. మరి ఇప్పుడు పుష్ప రాజ్ హవా జరుగుతుంది. పుష్ప కలెక్షన్స్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. అల్లు అర్జున్ సినిమా కలెక్షన్స్ తో రికార్డులన్నీ తలకిందలు అవుతున్నాయి. అసలే ఇప్పుడు కరోనా కొత్త వైరస్ మూడో రౌండ్ స్టార్ట్ అయిన నేపధ్యంలో బాక్సాఫీస్ మందంగా నడుస్తుందనే చెప్పాలి.
బాక్సాఫీస్ వద్ద పుష్ప లెక్కలు రేంజ్ అంచనాలు మించి ఉంటున్నాయి. కానీ మైత్రీ మూవీస్ అధికారికంగా చెప్పే లెక్కలకు, బయట ట్రేడ్ వర్గాలు చెబుతున్న లెక్క టెలీ అవ్వడం లేదు. దీంతో కలెక్షన్ల విషయంలో కాస్త వివాదాలు మొదలైయాయి. ప్రస్తుతం బుక్ మై షో వెబ్సైట్ నుంచి కొన్ని లెక్కలు రిలీజ్ చేసింది. పుష్ప సినిమా రిలీజ్ అయి ఎనిమిది రోజుల్లోనే బుక్ మై షో ద్వారా 35 లక్షల టికెట్లు అమ్ముడుపోయిందని ఆన్లైన్ లెక్క రిలీజ్ చేసింది. ఇది ఈ ఏడాదిలోనే అత్యధికమని తెలిపింది. అయితే ఈ ఏడాదిలో ఏ సినిమాకు ఈ రికార్డు చెయలేదని తెలుస్తోంది.
టాలీవుడ్ లో ఈ సారి అల్లు అర్జున్ మాత్రం సోషల్ మీడియా రికార్డులతో సరిపెట్టుకోలేదు కొత్తగా బుక్ మై షోలో రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ఆనందంలో హాల్ చల్ చేస్తున్నారు. ప్రస్తుతం పుష్ప రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన మరింత స్పీడ్ పెంచిందని తెలుస్తోంది. ప్రతీ థియేటర్ ముందు హౌస్ ఫుల్ బోర్డులతో పుష్ప థ రైస్ దూసుకెళ్లుతుంది. మొత్తానికి లెక్కలు మాస్టర్ సుకుమార్ వేసిన కాలికేషన్ మిస్ అవ్వలేదు.