సీనియర్ నటుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం

తెలుగు సీనియ‌ర్ న‌టుడు కైకాల స‌త్యనారాయ‌ణ(86) ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంది. 

Kaikala Sathyanarayana

కొన్ని రోజులముందు ఆయ‌న ఇంట్లో జారిప‌డి హాస్పిట‌ల్‌లో చేరారు. ఆరోగ్యం కాస్త కుదుట‌ప‌డింద‌ని అనుకున్నస‌మయంలో ఇప్పుడు మ‌ళ్లీ మ‌రోసారి ఆయ‌న అనారోగ్యంతో ఆసుప‌త్రిలో జాయిన్ అయ్యారు. ఇప్పుడుఅపోలో ఆసుప‌త్రిలో వెంటిలేట‌ర్‌పై చికిత్స పొందుతున్నారు. కైకా స‌త్య‌నారాయ‌ణ‌. హీరోగా, ప్ర‌తినాయ‌కుడిగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా, క‌మెడియ‌న్ ఇలా అన్నీ ర‌కాల ప్రాత‌ల‌ను పోషించి నిర్మాతగానూ త‌న‌దైనగుర్తింపుతో  సినిమాలు రూపొందించారు.

60సంవత్సరాలుగా తెలుగు సినిమారంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు  చేశారు. ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదుపొందారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలుపోషించిన వారిలో సత్యనారాయణ ఒకరు. ఈయన 1996లో మచిలీపట్నం నుంచి తెలుగుదేశం తరపునలోక్‌సభకు ఎన్నికయ్యారు అన్న విషయం మన అందరికి తెలిసిన విషయం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది