సౌత్ ఇండియాలో చూస్తే శంకర్, రాజమౌళిల తర్వాత ఆ స్థాయిని అందుకున్న దర్శకుడు మురుగదాస్. రమణ, గజిని, తుపాకి, కత్తి లాంటి వరుసగా హిట్లు ఇచ్చిన మురుగదాస్. కానీ కత్తి తర్వాత స్పైడర్, సర్కార్, దర్బార్ లాంటి వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాడు.
దీంతో విజయ్ సైతం మురుగదాస్ కి హ్యాండిచ్చాడు. వీళ్లిద్దరి కలయికలో తుపాకి, కత్తి, సర్కార్ చిత్రాల తర్వాత మరో సినిమా జరగాల్సి ఉండగా. స్క్రిప్టు పరంగా సన్ పిక్చర్స్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది.
పెద్ద ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో మురుగదాస్ కెరీర్‌పై ప్రభావం చూపుతుందనుకొన్నారు. ఇతే ఇంకా పెద్ద సంస్థతో మురుగదాస్ ఓ హాలీవుడ్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. ఫాక్స్ స్టార్ సంస్థ మురుగదాస్‌తో కలిసి ఇండియాలో సినిమాలు నిర్మించింది కూడా. ఇతే ఇప్పుడా ఫాక్స్ స్టార్ నిర్మాణంలోనే మురుగదాస్ హాలీవుడ్ సినిమా తీయడానికి ఆ సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. త్వరలో మురుగదాస్ హాలీవుడ్ డైరెక్టర్లతో పోటీకి సిద్ధం కానున్నారని తెలుస్తుంది.
