భయం వదిలేసిన రోజే మనం గెలుస్తాం.

భరత్‌ కమ్మదర్శకతంలో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’.ఈ సినిమా మ్యూజిక్‌ ఫెస్టివల్‌ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమాలోని పాటలకు విజయ్‌, రష్మిక స్టెప్పులేసి హంగామా చేశారు.


విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘‘నటుణ్ణి కావాలనుకున్నప్పుడు అవుతానా? లేనా అని భయమేసింది. అందరిలోనూ ఇలాంటి భయం ఒకటుంటుంది. దాన్ని వదిలేసిన రోజే మనం గెలుస్తాం. జీవితంలో మనకు ఇష్టమైన దానికోసం పోరాటం చేయాల్సిందే. అప్పుడే అది మన దగ్గరికొస్తుందని చెప్పే ప్రయత్నమే ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా. భయాన్ని వదిలేేస్త ఎవరు అడ్డుకున్నా జయము నీదేలే అని ఇందులో ఒక పాట ఉంది. దాన్ని నమ్మి ఈ సినిమా చేశా.ఈ నెల 26న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాతలు చెప్పారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది