పూరీ జగన్నాథ్‌ హిట్ ట్రాక్ లో పడ్డట్టేనా?


డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌, హిట్ ట్రాక్ లో పడ్డట్టే, నిజం చెప్పాలంటే
ఒకప్పుడు కోట్లు పట్టుకుని పూరీతో సినిమా కోసం ఎదురుచూసిన స్టార్ హీరోలు, నిర్మాతలు పూరీకి వరుస ఫ్లాప్ కారణంగా ఆయనతో సినిమా తీయడానికి ఎవ్వరు ముందుకు రాలేదు. ఇందులో పూరీ తో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న హీరోలు సైతం పూరీని పట్టించుకోవడం మానేశారు.
‘టెంపర్’ చిత్రం తరువాత హిట్ ముఖమే చూడని పూరి చేసేది లేక సొంతంగా సినిమాలు తీసుకునేందుకు డైరెక్టర్ కమ్ నిర్మాతగా మారారు, తాజాగా ఆయన దర్శకత్వ నిర్మాణంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటంతో పూరి హిట్ ట్రాక్ ఎక్కినట్టే, చాలా రోజుల తరువాత మళ్లీ పూరీ మార్క్ మూవీ రావడంతో ఆనందంగా ఉన్నారాయన. ఈ సినిమా రెండు రోజుల్లోనే రూ. 25 కోట్లు వసూలు చేయడంతో పూరీ సేఫ్ అయినట్టే.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది