గ్యాంగ్‌లీడ‌ర్‌ కు పెద్ద సునామీ ఎదురైంది



గ్యాంగ్‌లీడ‌ర్‌ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా విక్రమ్ కుమార్  ద‌ర్శ‌కత్వం వహించారు, ఈ సినిమా ఆగ‌స్టు 30వ తేదీన విడుద‌లకు సిద్ధంగా ఉంది.

కాని అనుకోకుండా `గ్యాంగ్‌లీడ‌ర్‌`కు పెద్ద సునామీ ఎదురైంది, ఆగ‌స్టు 15న రావాల్సిన `సాహో` 30వ తేదీకి వాయిదా ప‌డింది. గ్రాఫిక్స్ ప‌నులు ఇంకా పూర్తి కాక‌పోవ‌డం వ‌ల్ల `సాహో` రెండు వారాలు ఆల‌స్యంగా 30న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంద‌ని టాక్ వినిపిస్తోంది.`సాహో`లాంటి భారీ సినిమాతో పోటీ ప‌డి మంచి ఓపెనింగ్స్ సాధించ‌డం సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు. అందుకే `గ్యాంగ్‌లీడ‌ర్‌` కూడా వాయిదా ప‌డుతుందని వార్త‌లు వినిపిస్తున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది